Homeతాజావార్తలుMLA Anirudh Reddy | సంచులు తీసుకొని పోయినోళ్లకు ఎంట్రీ లేదు.. కాంగ్రెస్​ ఎమ్మెల్యే సంచలన...

MLA Anirudh Reddy | సంచులు తీసుకొని పోయినోళ్లకు ఎంట్రీ లేదు.. కాంగ్రెస్​ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్​ కాంగ్రెస్​లో చేరుతారనే వార్తల నేపథ్యంలో జడ్చర్ల ​ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని మోసం చేసి, సంచులు తీసుకొని పోయినోళ్లకు మళ్లీ ఎంట్రీ లేదన్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLA Anirudh Reddy | మహబూబ్​నగర్​ జిల్లా (Mahabubnagar district) జడ్చర్ల కాంగ్రెస్​ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్​ కాంగ్రెస్​లో చేరుతారనే ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారికి తమ పార్టీలోకి ఎంట్రీ లేదన్నారు.

జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ (former MLA Erra Shekhar) కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఆయన గతంలో మూడు సార్లు టీడీపీ (TDP) నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం రాష్ట్రంలో టీడీపీ తన ఉనికిని కోల్పోవడంతో బీజేపీలో చేరారు. అనంతరం ఆ పార్టీకి గుడ్​బై చెప్పి.. కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్​ రాకపోవడంతో అసంతృప్తి చెంది హస్తం పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్​ఎస్​లో (BRS) చేరి కాంగ్రెస్​కు వ్యతిరేకంగా పని చేశారు. తాజాగా ఆయన మళ్లీ అధికార కాంగ్రెస్​లో చేరుతారని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని మోసం చేసి, సంచులు తీసుకొని పోయినోళ్లకు మళ్లీ ఎంట్రీ లేదన్నారు.

MLA Anirudh Reddy | సొంత తమ్ముడి హత్య

సర్పంచ్​ (Sarpanch) పదవి కోసం సొంత తమ్ముడిని చంపిన వారు.. రేపు ఎమ్మెల్యే పదవి కోసం తనను కూడా చంపుతారని అనిరుధ్​ రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా.. ఎర్ర శేఖర్​ సోదరుడు జగన్​మోహన్​ 2013లో హత్యకు గురయ్యారు. సర్పంచ్​ ఎన్నికల సమయంలో శేఖర్​, జగన్​ మోహన్​ భార్యలు నామినేషన్లు వేయడంతో గొడవ జరిగిందని, దీంతోనే జగన్​ మోహన్​ను శేఖర్​ హత్య చేయించాడని అప్పట్లో పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. కాగా.. ఈ కేసులో కోర్టు మాజీ ఎమ్మెల్యేను నిర్దోషిగా ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలని తనకు లేదన్నారు. ఇప్పుడు తాను జెడ్​ కేటగిరి భద్రత (Z category security) అడగాల అని వ్యాఖ్యానించారు.

MLA Anirudh Reddy | సీఎం క్లారిటీతో ఉన్నారు..

ఎర్ర శేఖర్‌ కాంగ్రెస్‌లో చేరడానికి వీలులేదని అనిరుధ్​​ రెడ్డి అన్నారు. మోసం చేసి పోయినవారికి మళ్లీ ఎంట్రీలేదు అని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ గౌడ్​ (PCC President Mahesh Goud) క్లారిటీతో ఉన్నారన్నారు. ఆయనను పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్​లో చేరుతున్నట్లు వార్తలు రాయించుకొని చిల్లర రాజకీయాలు చేయొద్దని పేర్కొన్నారు.