అక్షరటుడే, ఇందూరు : Nizamabad Urban BJP campaign | బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
Nizamabad Urban BJP campaign | నగరంలోని 8వ డివిజన్లో..
నగరంలోని 8వ డివిజన్లో బీజేపీ అభ్యర్థికి మద్దుతుగా ధన్పాల్ సూర్యానారాయణ గుప్తా సోమవారం ప్రచారం చేశారు. పలు కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిశారు. బీజేపీతోనే (Nizamabad BJP) నగర అభివృద్ధి సాధ్యమన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ (Nizamabad Municipal Corporation) పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 8వ డివిజన్లో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే మఠం పవన్ను గెలిపించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు..
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను(Central welfare schemes) ఎమ్మెల్యే వివరించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవినీతికి తావు లేకుండా అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందన్నారు. 8వ డివిజన్ అభ్యర్థి మఠం పవన్ మాట్లాడుతూ.. తనను ఆశీర్వదించి ఓటు వేయాలని కోరారు. డివిజన్ పరిధిలోని కాలనీల్లో సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.