అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Flag march | మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నేపథ్యంలో పోలీస్ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే పలుమార్లు సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
Nizamabad Flag march | నగరంలోని ఐదో టౌన్ పరిధిలో..
ఈ సందర్భంగా నగరంలో పోలీసులు శనివారం ప్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ఐదవ టౌన్ పరిధిలో సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు పోలీసులు కవాతు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలని.. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఖిల్లా చౌరస్తా నుండి హష్మీ కాలనీ మీదుగా శాంతి నగర్ ఈద్గా వరకు ఈ ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర ఏసీపీ ప్రకాష్‌తో పాటు, సీఐలు, ఎస్సైలు,క్యూఆర్టీ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, ఐదో టౌన్ సిబ్బంది, 150 మందివరకు పోలీసులు పాల్గొన్నారు.