అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : నగరంలోని డివిజన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని కార్పొరేటర్లు సామల ప్రసన్న సత్యపాల్, ఇప్పకాయల సుమిత్ర కిషోర్ (Sumithra Kishore) అన్నారు. నూతనంగా కార్పొరేటర్లుగా ఎన్నికైన సందర్భంగా కోటగల్లీలోని మార్కండేయ మందిరంలో (Markandeya Temple) వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
Nizamabad Urban Development | సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం..
48వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ప్రసన్న సత్యపాల్, 24వ డివిజన్ నుంచి కార్పొరేటర్ (Corporator)గా సుమిత్ర కిషోర్ విజయం సాధించారు. ఈ సందర్భంగా వారిని పద్మశాలి కులస్తులు ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ నగరంలోని 70 కుల సంఘాల సభ్యులకు మున్సిపాలిటీలో ఎలాంటి సమస్య వచ్చినా తాము ముందుండి పరిష్కరిస్తామన్నారు.
Nizamabad Urban Development | పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలి..
పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలని.. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో (ZPTC Elections) పోటీచేసి తమ సత్తాను చాటాలని కార్పొరేటర్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పద్మశాలి పట్టణ సంఘం, మహిళా సంఘం, యువజన సంఘం ప్రతినిధులు భీమిర్తి రవి, సురేందర్, సురుకుంట్ల శ్రీనివాస్, శ్రీరామ్ మురళి, దోర్నాల రాజు, బూస రవి, గాలిపల్లి నారాయణ, దోర్నాల సంధ్య, మేక పుష్ప తదితరులు పాల్గొన్నారు.