Homeతాజావార్తలుNarne Nithin | అట్ట‌హాసంగా టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్ పెళ్లి.. వేడుక‌లో ఎన్టీఆర్...

Narne Nithin | అట్ట‌హాసంగా టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్ పెళ్లి.. వేడుక‌లో ఎన్టీఆర్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా

సుమారు ఏడాది క్రితం నిశ్చితార్థం జరుపుకున్న టాలీవుడ్ యువహీరో నార్నే నితిన్, ఇప్పుడు తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టాడు. ఈ శుభకార్యంలో బామ్మర్ది జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఆయన లుక్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

- Advertisement -

అక్షర టుడే, వెబ్‌డెస్క్: Narne Nithin | టాలీవుడ్‌లో వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న‌ యంగ్ హీరో నార్నే నితిన్ (Narne nithin) ఇప్పుడు తన జీవితంలోని కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. శుక్రవారం (అక్టోబర్ 10) రాత్రి హైదరాబాద్ శివారు శంకర్‌పల్లిలో నితిన్-శివాని వివాహ వేడుక (Nithin-Shivanis wedding ceremony) అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ పెళ్లి కార్యక్రమానికి ఇరువురు కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్‌కు (Tollywood) చెందిన పలు ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Young Tiger Jr. NTR) తన భార్య లక్ష్మీ ప్రణతితో పాటు కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో కలిసి ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. బామ్మర్ది పెళ్లికి ఎన్టీఆర్ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌లో హాజరయ్యాడు. క్రీమ్ కలర్ కుర్తా, ఫుల్ గడ్డంతో కనిపించిన తారక్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Narne Nithin | వేడుక అద‌రింది..

“అదిరిపోయింది తారక్ NTR లుక్”, “బామ్మర్ది పెళ్లి అంటే ఆ మాత్రం ఉండాల్సిందే క‌దా”, “ఫ్యామిలీ ఫోటోలు కోసం వెయిటింగ్” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక వధువు శివాని విష‌యానికి వ‌స్తే ఆమె నెల్లూరు జిల్లాకు చెందిన తాళ్లూరి వెంకట కృష్ణ ప్రసాద్ – స్వరూప దంపతుల కుమార్తె. ఆమె టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ కు కజిన్ డాటర్ అని ప్రచారం జరుగుతోంది.

వెంకటేష్ కుటుంబానికి వీరి కుటుంబంతో సన్నిహిత బంధం ఉందని సమాచారం. గతేడాది నవంబర్‌ 3న వీరిద్ద‌రి నిశ్చితార్థం జరగ‌గా, ఏడాది త‌ర్వాత ఈ జంట పెళ్లి పీట‌లెక్కారు. ఇక నార్నే నితిన్ 2023లో “మ్యాడ్” సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత “ఆయ్”, “మ్యాడ్-2 (మ్యాడ్ స్క్వేర్)” చిత్రాలతో వరుస విజయాలు సాధించాడు. తాజాగా “శ్రీశ్రీశ్రీ రాజావారు” సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించాడు. తన యాక్టింగ్‌కి, ఎనర్జీకి మంచి ఫ్యాన్ బేస్ కూడానూ ఏర్ప‌డింది.

ఇక నార్నే నితిన్- శివానిల పెళ్లి వేడుకకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రానా దగ్గుబాటి (Rana Daggubati), వెంకటేష్ (Venkatesh), నిర్మాతలు చినబాబు, నాగవంశీ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వేడుకకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నితిన్, శివానీల జోడికి ఫ్యాన్స్ మరియు సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తారక్ ఫ్యామిలీతో పాటు, కళ్యాణ్ రామ్, రానా లాంటి ప్రముఖుల ఫ్యామిలీ పిక్స్ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం #NarneNithinWedding అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.