అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nisar Satellite | భారత్, అమెరికా (India- America) సంయుక్తంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (Satish Dhawan Space Centre) నుంచి బుధవారం ఈ రాకెట్‌ను విజయవంతంగా ఇస్రో ప్రయోగించింది. నాసా– ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ (NISAR) ఉపగ్రహాన్ని GSLV-F16 రాకెట్ ద్వారా నింగిలోకి పంపారు. రాకెట్ ప్రయోగించిన తర్వాత 2,293 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని 743 కి.మీ సూర్య-సమకాలిక కక్ష్యలో ప్రవేశ పెట్టింది.
Nisar Satellite | రెండు సింథటిక్ రాడార్లు
ఇస్రో, నాసా కలిసి ఈ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశాయి. రెండు రాడార్లు ఉపయోగించిన తొలి శాటిలైట్ ఇదే కావడం గమనార్హం. భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలను ముందే అంచనా వేయడానికి ఈ ఉపగ్రహం సహాయ పడుతుంది. భూమి క్రస్ట్, ఉపరితల కదలికలో చిన్న మార్పులను కూడా ఈ ఉపగ్రహం గుర్తించగలదు. దీని డేటా సముద్రపు మంచు వర్గీకరణ, ఓడ గుర్తింపు, తీరప్రాంత పర్యవేక్షణ, తుపాను ట్రాకింగ్, పంట మ్యాపింగ్ నేల తేమలో మార్పులకు కూడా ఉపయోగ పడుతుంది.
Nisar Satellite | ఇస్రో 102వ ప్రయోగం
ఇస్రో నిసార్ ఉపగ్రహాన్ని తన 102వ మిషన్ ద్వారా నింగిలోకి పంపింది. రాడార్ (Radar) ఆధారిత భూమి పరిశీలన కోసం ఈ ప్రయోగం చేపట్టారు. ఈ శాటిలైట్ 2,393 కిలోల బరువు ఉంటుంది. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ ఎపర్చర్ రాడార్ సాయంతో పగలు, రాత్రి భూమిపై హై రిజల్యూషన్‌తో డేటా అందించగలదు. ఈ ఉపగ్రహం కక్ష్యలోకి చేరిన తర్వాత 12 రోజులకు ఒకసారి భూమిని స్కాన్ చేస్తుంది.
“गौरव का क्षण”
श्रीहरिकोटा के सतीश धवन अंतरिक्ष केंद्र से GSLV-F16 के माध्यम से NASA-ISRO के संयुक्त उपग्रह #NISAR का सफलतापूर्वक प्रक्षेपण किया जाना प्रत्येक देशवासी के लिए अत्यंत गर्व का विषय है।
यह उपग्रह पृथ्वी की सतह और बर्फीले क्षेत्रों में हो रहे परिवर्तनों पर बारीकी से… pic.twitter.com/GPdvZVQZix
— C. P. Joshi (@cpjoshiBJP) July 30, 2025