HomeUncategorizedNikhitha Dutta | బాలీవుడ్‌లో గుబులు పుట్టిస్తున్న కరోనా.. రీసెంట్‌గా మంచి హిట్ కొట్టిన భామ‌కి...

Nikhitha Dutta | బాలీవుడ్‌లో గుబులు పుట్టిస్తున్న కరోనా.. రీసెంట్‌గా మంచి హిట్ కొట్టిన భామ‌కి పాజిటివ్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nikhitha Dutta | మొన్నటి వ‌ర‌కు శాంతించిన కరోనా Corona ఇప్పుడు మ‌ళ్లీ గుబులు పుట్టిస్తోంది. ఇక్క‌డ అక్క‌డ అని కాకుండా అన్ని రాష్ట్రాల‌లో క‌రోనా జూలు విదిలిస్తోంది. సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించిన ప్రముఖుల‌లో కూడా కొంద‌రికి క‌రోనా టెన్ష‌న్ మొదలైంది. తాజాగా బాలీవుడ్ న‌టి నిఖిత ద‌త్తా(Bollywood actress Nikhitha Dutta) క‌రోనా బారిన ప‌డింది. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా తెలియ‌జేసింది. నిఖిత దత్త చివరగా సైఫ్ అలీ ఖాన్ సరసన జ్యువెల్ థీఫ్ అనే చిత్రంలో నటించారు. నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ అందుకుంది. డైమండ్ రాబరీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం అత్యధిక వ్యూస్ తో నెట్ ఫ్లెక్స్(Net Flix) లో దూసుకుపోతోంది.

Nikhitha Dutta | క‌రోనా టెన్ష‌న్

అయితే నిఖిత ద‌త్తా Nikita dutta త‌న సోష‌ల్ మీడియాలో నాకు, మా అమ్మకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయినా ఇది మాతో ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. కొద్ది రోజుల క్వారంటైన్‌(Quarantine)తో మేము ఆరోగ్యంగా బయటకు వస్తాం’ అంటూ నికితా దత్తా పేర్కొంది. కాగా.. ఈ నెలలో మహరాష్ట్రలో 95 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం రోజుల క్రితం బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్(Shilpa Shirodkar)కు కోవిడ్ పాజిటివ్​గా నిర్ధారణ అయింది. శిల్పా శిరోద్కర్.. మహేష్ బాబు సతీమణి నమ్రతకి సోదరి అనే సంగతి తెలిసిందే. నాకు కోవిడ్ పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ప్రజలంతా మాస్కులు ధరించి సేఫ్​గా ఉండండి అంటూ శిల్పా శిరోద్కర్ సోషల్ మీడియా(Social Media)లో ప్రకటించారు.

ఇటీవల ఇండియాలో 200పైగా కోవిడ్ కేసులో నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వాలు(State Governments) కూడా తగిన చర్యలు ప్రారంభించాయి. మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, కేర‌ళ వంటి రాష్ట్రాల‌లో క‌రోనా విజృంభిస్తుంది. ఏపీలో Andhra Pradesh కూడా తొలి కేసు న‌మోదవ‌డంతో ఆమె ఐసోలేష‌న్​లో ఉంది. ప్ర‌భుత్వాలు కూడా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోమ‌ని హెచ్చ‌రిస్తుంది. స‌భ‌లు, గుంపులుగుంపులు వంటి ప్ర‌దేశాల‌కు వెళ్ల‌డం చేయొద్దు అని తెలియ‌జేసింది.