అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Excise Department | ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆబ్కారీ శాఖ అధికారుల సంఘం కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ (Prohibition and Excise Department) డీటీఎఫ్ విలాస్‌కుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.
Excise Department | కార్యవర్గం ఇదే..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో అంజిత్ రావు, ప్రధాన కార్యదర్శిగా కామారెడ్డికి చెందిన ఎస్‌హెచ్‌వో విక్రమ్ కుమార్ (Kamareddy SHO Vikram Kumar) ఎన్నుకున్నారు.
అసోసియేట్ అధ్యక్షుడిగా నిజామాబాద్ ఎస్‌హెచ్‌వో ఏ.గంగాధర్, ఉపాధ్యక్షుడిగా బోధన్ ఎస్‌హెచ్‌వో భాస్కర్ రావు, కార్యదర్శిగా ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో ప్రమోద్ చైతన్య, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నిజామాబాద్‌కు చెందిన ఎస్‌హెచ్‌వో మల్లేష్, జయంతి సెక్రెటరీగా వెంకటేష్, కార్యవర్గ సభ్యులుగా దిలీప్ (బాన్సువాడ), మధుసూదన్‌రావు (దోమకొండ), తేజస్విని (బాన్సువాడ), శరత్ (కామారెడ్డి)లను ఎన్నుకున్నారు.
