అక్షరటుడే, హైదరాబాద్: Nepali gang Robbery | గ్రేటర్ హైదరాబాద్‌లోని కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. గన్‌రాక్ ఎన్‌క్లేవ్‌లో నేపాల్ ముఠా దొంగతనానికి పాల్పడింది.
ఇక్కడ నివాసం ఉంటున్న కెప్టెన్ గిరి (75) ఇంట్లోకి చొరబడ్డ నేపాలీలు ఉన్నదంతా దోచుకున్నారు. ఈయన ఇంట్లో పనిచేసే నేపాలీ.. మరో నలుగురు స్నేహితులతో కలిసి ఇంటి యజమానిపై దాడి చేశారు.
Nepali gang Robbery | రూ.50 లక్షల విలువైన..
అతడిని కాళ్లూ చేతులు కట్టేసి.. ఇంట్లో ఉన్న సుమారు రూ. 50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు దోచుకుని పారిపోయారు.
మొత్తం 250 గ్రాములకు పైగా గోల్డ్, రూ.23 లక్షల నగదు చోరీ అయినట్లు బాధిత కుటుంబం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఆధారాలు సేకరించారు. ఆరు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు.
