National seminar Kamareddy college | ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సెమినార్.. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సెమినార్​ నిర్వహణకు ముస్తాబవుతోంది. ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సెమినార్ కోసం కళాశాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

అక్షరటుడే, కామారెడ్డి: National seminar Kamareddy college | కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Government Degree College) జాతీయ సెమినార్ (National seminar)​ నిర్వహణకు ముస్తాబవుతోంది. రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సెమినార్ కోసం కళాశాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

National seminar Kamareddy college | 60ఏళ్ల సుదీర్ఘ చరిత్ర..

60 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగి, న్యాక్ ‘ఏ’ గ్రేడ్(NAAC A Grade) సాధించిన ఈ కళాశాల ఇప్పుడు జాతీయ స్థాయి అతిథులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.విజయ్ కుమార్ వివరాలు వెల్లడించారు. సెమినార్ ఏర్పాట్లలో భాగంగా కళాశాల ప్రవేశ ద్వారం వద్ద రోడ్డుకు ఇరువైపులా మట్టితో చదును చేసి సుందరీకరణ పనులు చేపట్టామన్నారు.

పరిసరాల పరిశుభ్రతతో పాటు పెయింటింగ్ పనులు పూర్తి చేసి చేసినట్లు తెలిపారు. అత్యాధునిక డిజిటల్ సెమినార్ హాల్‌ను సిద్ధం చేశామని, ఈ సెమినార్‌కు దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల నుంచి ప్రముఖ ఆచార్యులు, విశ్లేషకులు రానున్నారని తెలిపారు.

ఉన్నత విద్యామండలి ఛైర్మన్..

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి(Telangana State Higher Education Council) ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకృష్ణారెడ్డి, కళాశాల విద్యా కమిషనర్ దేవసేన, ప్రస్తుత రేరా ఛైర్మన్, పూర్వ కామారెడ్డి కలెక్టర్ డాక్టర్ సత్యనారాయణ తదితరులు హాజరుకానున్నట్లు వివరించారు. నూతన విద్యా విధానంలో మార్పులు, దేశాభివృద్ధిలో ఉన్నత విద్య ప్రాధాన్యతపై ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు తమ పరిశోధనా పత్రాలను ఈ సెమినార్​లో సమర్పించనున్నారని పేర్కొన్నారు.

ఈ జాతీయ సెమినార్ నిర్వహణ ద్వారా కళాశాల ర్యాంకింగ్‌ను, నాణ్యతా ప్రమాణాలను మరింత మెరుగుపర్చుకునే అవకాశం ఉందన్నారు. ప్రతిష్టాత్మకమైన మా కళాశాలలో ఈ సెమినార్ నిర్వహించడం వల్ల విద్యాపరంగా కళాశాల కీర్తి మరింత పెరుగుతుందని వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. కిష్టయ్య తెలిపారు.

           ప్రిన్సిపాల్ విజయ్ కుమార్                                       వైస్ ప్రిన్సిపాల్ కిష్టయ్య

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

GHMC Election Sanitation Drive | అధికారుల బస్తీబాట.. జీహెచ్​ఎంసీ ఎన్నికల కోసమేనా?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : GHMC Election Sanitation Drive | గ్రేటర్​ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)​ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. దీంతో త్వరలో...

Hyderabad Lakes Development | చెరువుల‌ అభివృద్ధిని వేగవంతం చేయాలి : హైడ్రా క‌మిష‌న‌ర్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Lakes Development | హైదరాబాద్ (Hyderabad)​ న‌గ‌రంలో చెరువుల అభివృద్ధిని వేగవంతం చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ (Commissioner...

Anvesh Lookout Notice | యూట్యూబర్​ అన్వేష్​కు షాక్​.. లుకౌట్​ నోటీసులు జారీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anvesh Lookout Notice | యూట్యూబర్​ అన్వేష్​కు హైదరాబాద్ (Hyderabad)​ పోలీసులు షాక్​ ఇచ్చారు. ఇప్పటికే అతడి ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్...

Food safety rule compliance | ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లలో ఆహార భద్రత నియమాలు పాటించాలి

ఆహార భద్రతా నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నవిత హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో పలు ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లను హోటళ్లను బుధవారం తనిఖీ చేశారు.