అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Natalie Burn | కన్నడ స్టార్ యశ్ హీరో (Hero Yash)గా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టాక్సిక్’ ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. యశ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన హీరో ఇంట్రడక్షన్ వీడియో సినిమాపై హైప్‌ను మరింత పెంచింది.
ఈ వీడియోలో యశ్ ‘రాయ’ అనే పాత్రలో కనిపించగా, ఒక కారు సన్నివేశంలో ఆయనతో పాటు కనిపించిన ఓ విదేశీ నటి సోషల్ మీడియాలో (Social Media) హాట్ టాపిక్‌గా మారింది. ఆ సీన్‌లో యశ్‌తో స్క్రీన్ షేర్ చేసిన ఆ అమ్మాయి ఎవరు? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అనే ప్రశ్నలు నెటిజన్లలో ఆసక్తిని రేపాయి.
Natalie Burn | ఆమె ఎవరంటే..
ఆ విదేశీ నటి పేరు నటాలీ బర్న్. ఉక్రెయిన్–అమెరికన్ నటి అయిన ఆమె 2006 నుంచే హాలీవుడ్‌లో నటిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో నటాలీయ గుస్లిష్టాయాగా జన్మించిన ఆమె, సినిమాలపై ఉన్న ఆసక్తితో అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడింది. యాక్షన్ జానర్‌లో మంచి గుర్తింపు సంపాదించిన నటాలీ బర్న్, ‘ది ఎక్స్‌పెండబుల్స్ 3’, ‘మెకానిక్: రిసరెక్షన్’ వంటి భారీ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు, ‘ది కమ్‌బ్యాక్ ట్రైల్’, ‘ఐస్ ఇన్ ది ట్రీస్’ లాంటి థ్రిల్లర్ సినిమాల్లోనూ తన నటనతో మెప్పించింది.
నటిగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా ఆమెకు అనుభవం ఉంది. పలు అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లకు సహ నిర్మాతగా వ్యవహరించిన నటాలీ బర్న్, మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందిన యాక్షన్ పెర్ఫార్మర్‌గా కూడా పేరు తెచ్చుకుంది. నాలుగు భాషలు మాట్లాడగల ఆమె, ఇప్పుడు తొలిసారిగా ఒక ఇండియన్ సినిమాలో నటించడం విశేషం. అంతేకాదు, ‘టాక్సిక్’ చిత్రంలో (Toxic Movie) నటించడమే కాకుండా సహ నిర్మాతగా కూడా పనిచేస్తుండడం ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఇక ‘టాక్సిక్’ సినిమా విషయానికి వస్తే, క్రిటికల్‌గా ప్రశంసలు అందుకున్న చిత్రాలతో తనదైన ముద్ర వేసిన గీతూ మోహన్‌దాస్ (Director Geethu Mohandas), ఈ సినిమాతో పూర్తి స్థాయి కమర్షియల్ జానర్‌లోకి అడుగుపెడుతోంది. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ చిత్రం, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో డబ్ వెర్షన్లుగా విడుదల కానుంది. యశ్ సరసన కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ వంటి స్టార్ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాతో నటాలీ బర్న్‌కు ఇండియన్ మార్కెట్‌లో ఎలాంటి గుర్తింపు వస్తుందో చూడాలని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.