Nizamabad Collector | నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ ను విజయవంతం చేయాలి

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా ఈనెల 20 నుంచి 26 వరకు నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. ఈ మేరకు కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. డ్రగ్స్‌ రహిత జిల్లా లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. డ్రగ్స్‌ వల్ల నష్టాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. […]

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా ఈనెల 20 నుంచి 26 వరకు నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. ఈ మేరకు కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. డ్రగ్స్‌ రహిత జిల్లా లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. డ్రగ్స్‌ వల్ల నష్టాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల నిరోధక కమిటీలు బలోపేతం చేయాలన్నారు. 25న మాదకద్రవ్యాల నియంత్రణ అంశంపై విద్యార్థులకు పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలన పోస్టర్లు ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా సంక్షేమాధికారిణి రసూల్‌ బీ, అదనపు డీసీపీ బస్వారెడ్డి, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో నిజామాబాద్‌ జోన్‌ డీఎస్పీ సోమనాథం, డీఎంహెచ్‌ఓ రాజశ్రీ, డీఐఈవో రవికుమార్‌ పాల్గొన్నారు.

Related articles

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.