అక్షరటుడే, వెబ్‌డెస్క్: Forensic Lab Fire Incident | నాంపల్లి (Nampally)లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలు కీలక పత్రాలు కాలిపోయినట్లు సమాచారం.ఫోరెన్సిక్ ల్యాబ్‌లోని మొదటి అంతస్తులో కంప్యూటర్ ల్యాబ్ (Computer Lab)లో మొదట మంటలు చెలరేగాయి.
గమనించిన సిబ్బంది బయటకు పరుగులు తీశారు. అనంతరం పోలీసులు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ఐదు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. డీసీపీ శిల్పవల్లి (DCP Shilpavalli) ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అగ్ని మాపక సిబ్బంది దాదాపు రెండున్నర గంటల పాటు శ్రమించి మంటలు ఆర్పి వేశారు. ప్రమాద సమయంలో లోపల ఉన్న ఒకరికి గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు.
Forensic Lab Fire Incident | షార్ట్ సర్క్యూట్‌తో..
అకస్మాత్తుగా కంప్యూటర్ ల్యాబ్‌లో ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పోలీసుల ఆరా తీస్తున్నారు. పలు కీలకమైన పత్రాలు అగ్నికి ఆహుతి అయినట్లు సమాచారం. ఈ ఘటనపై సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి మీడియాతో మాట్లాడారు. 5 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను పూర్తిగా అదుపు చేశామని చెప్పారు. ఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత లేదన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలిపారు.
Forensic Lab Fire Incident | ఫిజికల్ ఎవిడెన్స్ దగ్ధం
డీఎఫ్‌వో శ్రీదాస్ (DFO Sridas) మాట్లాడుతూ.. ల్యాబ్‌లోని సీజ్డ్ ప్రాపర్టీస్ గది పూర్తిగా దగ్ధమైందన్నారు. పలు కేసుల్లో సేకరించిన ఫిజికల్ ఎవిడెన్స్ (Physical Evidence) మొత్తం కాలిపోయిందని చెప్పారు. పలు కేసుల్లో సీజ్ చేసిన సుమారు 40-50 కంప్యూటర్లు కాలిపోయాయన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందన్నారు.