అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mla Madan Mohan | ఎల్లారెడ్డి మున్సిపాలిటీని (Yellareddy municipality) అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నానని ఎమ్మెల్యే మదన్ మోహన్ (Mla Madan Mohan) అన్నారు. ఈ మేరకు పట్టణంలోని పలు వార్డుల్లో బుధవారం పర్యటించారు.
ఇప్పటిదాకా ఎంతో అభివృద్ధి చేశాం..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధునిక సౌకర్యాలతో నూతన బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేశామన్నారు. ప్రజలకు విశ్రాంతి, వినోదం కల్పించేలా మినీ ట్యాంక్ బండ్ (mini tank bund) అభివృద్ధి చేశామని తెలిపారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులు చేపట్టి మౌలిక వసతులు మెరుగుపడేలా కృషి చేశామని వివరించారు. 300 డబుల్ బెడ్రూం ఇళ్లను అందించామన్నారు. అమృత్ పథకం ద్వారా ఇంటింటికి తాగునీటి సౌకర్యం కల్పించామన్నారు.
పట్టణాభివృద్ధికి కృషి
గాంధీ చౌక్ అభివృద్ధి, ఆధునిక లైటింగ్, రోడ్డు విస్తరణతో నూతన రూపం ఇచ్చామని ఎమ్మెల్యే తెలిపారు. అంబేద్కర్ చౌరస్తా అభివృద్ధిలో భాగంగా ఫౌంటెన్లు, ల్యాండ్‌స్కేపింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెస్తామన్నారు. ఐటీఐ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంచేలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేశామని వివరించారు. ప్రజల ఆరోగ్యం, వినోదం కోసం 100 ఎకరాల్లో అర్బన్ పార్క్ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.