అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | నగరంలో దారుణం చోటు చేసుకుంది. రూ.రెండు వేల కోసం ఓ వృద్ధుడిని హత్య చేశారు. ఈ ఘటన 25 రోజుల క్రితం జరగ్గా.. పోలీసులు తాజాగా నిందితుడిని అరెస్ట్ చేశారు.
నిజామాబాద్ నగరంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 25 రోజుల క్రితం ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రోడ్డు పక్కన పడుకున్న ఆ వ్యక్తిని నిందితుడు వైర్‌తో ఉరి వేసి చంపేశాడు. వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. కోటగిరి మండం జైనపూర్కు చెందిన హైమద్ రూ.రెండు వేల కోసం ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. వృద్ధుడిని చంపేసి, అతడి జేబులో ఉన్న రూ.2 వేలు తీసుకొని పారిపోయాడన్నారు. ఈ మేరకు హైమద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.