అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Municipal elections cash seizure | మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు కాలనీల్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. 9న సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలో పలువురు అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు యత్నిస్తున్నారు. దీంతో అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల (Municipal elections) కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి శుక్రవారం వరకు అధికారులు రూ. 89,30,200 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. రూ.84,89,373 విలువైన మధ్యం, రూ. 13,27,885 విలువైన మాదక ద్రవ్యాలు సీజ్‌చేశారు. బంగారం, వెండి ఇతర లోహాల వంటి విలువైన వస్తువులు సైతం పట్టుకున్నారు. వీటి విలువ రూ.14,69,320 ఉంటుందన్నారు. మొత్తం: రూ.రెండు కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
Municipal elections cash seizure | హెల్ప్‌లైన్ ఏర్పాటు
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) హెల్ప్‌లైన్ (9247597066) నంబర్ ఏర్పాటు చేసింది. ఈ నెల 9 వరకు ఈ నంబర్ సేవలు అందించనుంది. సాధారణ ప్రజల ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించడానికి దీనిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలకు సంబంధించి సమస్యలు, అక్రమాలు, ఇతర విషయాలపై ఫిర్యాదు చేయడానికి ప్రజలు ఈ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.