అక్షరటుడే, వెబ్డెస్క్: Municipal Nominations | తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల (municipal elections) నామినేషన్ల ప్రకియ ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు అధికారులు నామినేషన్లను (nominations) స్వీకరించారు. శుక్రవారం చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా.. శనివారం నామినేష్లన పరిశీలన నిర్వహించనున్నారు.
Municipal Nominations | ఫిబ్రవరి 3 వరకు ఉపసంహరణ గడువు
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఒక్కో వార్డు నుంచి ఒక్కో పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. తమకే టికెట్ దక్కుతుందన్న నమ్మకంతో పోటీకి సై అంటున్నారు. అయితే ఫిబ్రవరి 2వ తేదీ వరకు బీ ఫాం అందజేసేందుకు అవకాశం ఉంది. ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఉపసంహరణ గడువు ఉన్న విషయం తెలిసిందే. కాగా.. పార్టీలు బీఫాం అందజేసిన అనంతరం అభ్యర్థులు అధిక సంఖ్యలో నామినేషన్లు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
Municipal Nominations | 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో..
రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో గల 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగనున్నాయి. 414 డివిజన్లు, 2,582 వార్డుల్లో ఫిబ్రవరి 11న ఒకే దశలో పోలింగ్ జరుగనుంది. ఓటింగ్ కోసం 8,203 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొత్తం 52.43 లక్షల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అనంతరం 13వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ చేపడతారు. అనంతరం 16న మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్లు, డిప్యూటీ ఛైర్మన్లను ఎన్నుకోనున్నారు.