అక్షరటుడే, ఇందూరు : Municipal Election Campaign Ban | మున్సిపల్ ఎన్నికల నిబంధనల్లో భాగంగా 9వతేదీ (సోమవారం) సాయంత్రం నుంచి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమల్లోకి వస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Municipal Election Campaign Ban | సాయంత్రం 5 గంటల నుంచి..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచారం పూర్తిగా నిషిద్ధమన్నారు. నిజామాబాద్ (Nizamabad) నగరపాలక సంస్థతో పాటు ఆర్మూర్, భీమ్గల్, బోధన్ మున్సిపాలిటీల్లో (Bodhan Municipality) ఎన్నికలు ముగిసే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. 48 గంటల సమయంలో ఎవరు కూడా బహిరంగ ఎన్నికల ప్రచారం చేయరాదని తెలిపారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి..
ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఎన్సీసీ బృందాలు పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. పోలీసు అధికారులు (Police Officers) కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. ఎటువంటి అనుమానం వచ్చినా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పారు.