mumbai indians
Mumbai Indians | అదృష్టం అంటే ముంబైదే.. పంజాబ్‌ని ప‌క్క‌కి నెట్టి రెండో స్థానానికి పాండ్యా జ‌ట్టు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: mumbai indians | ఐపీఎల్ 2025లో (IPL 2025) భాగంగా జీటీ (GT), పంజాబ్ (Punjab), ఆర్సీబీ (RCB), ముంబై ప్లే ఆఫ్స్‌కి (Mumbai Play offs) వెళ్లిన విష‌యం తెలిసిందే. ఏ జ‌ట్టు మొద‌టి రెండు స్థానాలు ద‌క్కించుకుంటుంది అనే దానిపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది.

పంజాబ్ జ‌ట్టు (Punjab Team).. ఢిల్లీపై గెలిచి టాప్ 2లో త‌మ స్థానం ప‌దిలం చేసుకోవాల‌ని అనుకుంది. కాగా, గ‌త రాత్రి జ‌రిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో అనూహ్యంగా ముంబై ఇండియన్స్ జట్టు (Mumbai Indians Teams) టాప్-2 రేసులోకి దూసుకెళ్లేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి. పంజాబ్‌పై ఢిల్లీ విజయం సాధించింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో ఉన్న ముంబై జట్టుకు టాప్-2కు వెళ్లే అవకాశం లభించింది. అయితే, ముంబై జట్టు టాప్-2లోకి (Top 2) వెళ్లాలంటే తన చివరి మ్యాచ్‌లో విజయం సాధించాలి. అలాగే మిగిలిన రెండు జట్ల గెలుపోటములపై ఆధారపడి ఉంటుంది.

mumbai indians | స‌మీక‌ర‌ణాలు ఇలా..

టాప్- 2లోకి ముంబై ఇండియన్స్ ఎలా వస్తుందో స‌మీక‌ర‌ణాలు చూస్తే.. ప్రస్తుతం పట్టికలో గుజరాత్ (Gujarath)(18), పంజాబ్ (Pujnab)(17), బెంగళూరు(Banglore)(17), ముంబై (Mumbai)(16) పాయింట్లతో ఉన్నాయి. ఢిల్లీ చేతిలో పంజాబ్ కింగ్స్ ఓడిపోయినప్పటికీ ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతుంది. అయితే, ఆ జట్టుకు ముంబై ఇండియన్స్ నుంచి ప్రమాదం పొంచి ఉంది. నాలుగు జట్లు 13 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. ఇంకా ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ముంబై ఇండియన్స్ సోమవారం పంజాబ్ కింగ్స్ తో (Punjab Kings) తలపడనుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓడిపోతే టాప్-2 రేసు నుంచి త‌ప్పుకుంటుంది. అదే సమయంలో ముంబై జట్టు టాప్ -2 ప్లేసులోకి దూసుకెళ్తుంది. పంజాబ్‌పై ముంబై విజయం సాధించినప్పటికీ.. టాప్-2 రేసులో ప్లేస్ (TOP 2 place) ఖాయమవుతుందని చెప్పలేం.

గుజరాత్, బెంగళూరు జట్లు (Gujarat and Bangalore Teams) కూడా టాప్-2 ప్లేస్‌ల కోసం పోటీపడుతున్నాయి. ఒకవేళ గుజరాత్ జట్టు చెన్నైపై ఓడిపోతే పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో ఆగిపోతుంది. అదే సమయంలో ముంబై జట్టు పంజాబ్ కింగ్స్ పై మెరుగైన రన్‌ రేటుతో విజయం సాధిస్తే టాప్ -2 రేసులో తన స్థానం పదిలం చేసుకుంటుంది. ప్రస్తుతం గుజరాత్ రన్ రేటు ప్లస్ 0.602గా ఉంది. ముంబై ఇండియన్స్ ప్లస్ 1.292 రన్ రేటుతో (Run rate) మెరుగైన స్థానంలోనే ఉంది. గుజరాత్ చెన్నైతో మ్యాచ్‌లో ఓడిపోయి.. పంజాబ్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తే రెండు జట్లు 18 పాయింట్లతో సమం అవుతాయి. రన్ రేట్ ఆధారంగా ముంబై జట్టు టాప్-2 ప్లేస్‌ను ఖాయం చేసుకున్నట్లవుతుంది. ఒకవేళ చెన్నై జట్టుపై (Chennai team) గుజరాత్ ఓడిపోయి.. పంజాబ్ కింగ్స్ పై ముంబై గెలిచి.. ఈనెల 27న ఆర్సీబీ జట్టుపై లక్నో జట్టు విజయం సాధిస్తే.. ముంబై జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లే అవకాశం కూడా ఉంది.