అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | ప్రతి ఒక్కరూ జీవన సంకల్పంతో ముందుకు సాగాలని ప్రముఖ కవి మేడిచర్ల ప్రభాకర్ రావు (Medicharla Prabhakar Rao) అన్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ (railway station) పక్కన ఉన్న గీతా భవన్లో రచయిత తొగర్ల సురేష్ రచించిన సంకల్పం యాత్ర చరిత్ర గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించారు.
ముందుగా ప్రముఖ ఆర్షకవి, వైదిక పురోహితులు తిరుమల శ్రీనివాస్ ఆర్య ఈశ్వర స్తుతి ప్రార్థన గీతాన్ని ఆలపించారు. అనంతరం ముఖ్య అతిథి మేడిచర్ల ప్రభాకర్ మాట్లాడుతూ.. లక్ష్యాన్ని ఏర్పరచుకొని ప్రతిఒక్కరూ ముందుకు సాగినప్పుడే జీవన సాఫల్యం కలుగుతుందన్నారు. అనంతరం కవి తిరుమల శ్రీనివాస్ ఆర్య మాట్లాడుతూ మనో సంకల్పం ఉంటే ఏ కార్యమైనా విజయతీరాలకు చేరుతుందని పేర్కొన్నారు. మరోకవి కంకణాల రాజేశ్వర్ మాట్లాడుతూ 1930లో కాశీ యాత్ర చరిత్ర గ్రంథం (Kashi Yatra History Book) రాసిన ఏనుగుల వీరాస్వామి కోవకు చెందినదే ఈ తొగర్ల సురేష్ రాసిన సంకల్పం యాత్ర చరిత్ర గ్రంథం అని వివరించారు.
అనంతరం కవులు, సాహితీవేత్తలు గ్రంథకర్త తొగర్ల సురేష్‌ను సత్కరించారు. ప్రముఖ ఇంద్రజాలికుడు వేదాంతం రంగనాథ్ తన వ్యాఖ్యానంతో మంత్రముగ్ధుల్ని చేశారు. కార్యక్రమంలో సహాయాత్రికుడు తిరునగరి నవనీత్, దంతాల రాజేశ్వర్, ఆడెపు లింబాద్రి, చాకు లింగం, గీతా దయానందం, డాక్టర్ పోత్నూర్ లక్ష్మణ్, వ్యక్తిత్వ వికాస నిపుణులు తిరునగరి శ్రీహరి, కండక్టర్ నర్సయ్య, జనగామ చంద్రశేఖర్ శర్మ, డాక్టర్ గురువారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
