అక్షరటుడే, వెబ్‌డెస్క్: Moto G86 Power | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ అయిన మోటోరోలా(Motorola) మరో మోడల్‌ను తీసుకువస్తోంది. పవర్‌ఫుల్ బ్యాటరీ, అద్భుత డిజైన్‌తో మోటో జీ86 పవర్ పేరుతో వస్తున్న ఈ మోడల్ ఈనెల 30న భారత్‌లో లాంచ్ (Launch) కానుంది. మోటోరోలా ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లలో అందుబాటులోకి రానున్న ఈ మోడల్ స్పెసిఫికేషన్స్ (Specifications) తెలుసుకుందామా..
6.67 అంగుళాల 1.5K ఫ్లాట్ POLED సూపర్ HD డిస్‌ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. కార్నింగ్ గొరిల్లా 7i ప్రొటెక్షన్‌ను ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ స్టైలిష్ వేగాన్ లెదర్ ఫినిష్‌తో కూడిన ప్రీమియం లుక్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత హెల్లో యూఐ ఆపరేటింగ్ సిస్టమ్.
6720 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్.. 33 డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
బ్యాక్‌సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. OIS సపోర్ట్‌తో 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ 600 ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ సెన్సార్, 2 ఎంపీ మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు వైపు 32 ఎంపీ కెమెరాను అమర్చారు. ఈ కెమెరాలు 30 fps వద్ద 4K వీడియో రికార్డింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ మోడల్ ఫోన్ MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, ఐపీ 68, ఐపీ 69 రేటింగ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది.
ఏఐ ఫొటో ఎన్‌హాన్స్‌మెంట్ ఇంజైన్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వంటి ఫీచర్లున్నాయి.
పాంటోన్ స్పెల్ బౌండ్, పాంటోన్ గోల్డెన్ సైప్రెస్, పాంటోన్ కాస్మిక్ స్కై కలర్ వేరియంట్‌లలో లభించనుంది. 8 GB రామ్, 128 GB స్టోరేజీతో వస్తున్న ఈ ఫోన్ ధర రూ. 20 వేలలోపు ఉండే అవకాశాలున్నాయి.