ePaper
More
    HomeFeaturesMoto G96 | ప్రీమియం లుక్‌తో మోటో ఫోన్‌.. స్పెసిఫికేషన్స్‌ ఇవే..

    Moto G96 | ప్రీమియం లుక్‌తో మోటో ఫోన్‌.. స్పెసిఫికేషన్స్‌ ఇవే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Moto G96 | ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ అయిన మొటోరోలా భారత మార్కెట్లో(Indian market) కొత్త మోడల్‌ను లాంచ్‌ చేసింది. మోటో G96 పేరుతో తీసుకువచ్చిన ఈ మోడల్‌ విక్రయాలు ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌(Flipkart)లలో అందుబాటులో ఉండనున్నాయి. ఈ మోడల్‌ స్పెసిఫికేషన్స్‌ ఇలా ఉన్నాయి.

    6.67 ఇంచెస్‌ 3D కర్వ్‌డ్‌ పీఓఎల్‌ఈడీ ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 144 Hz రిఫ్రెష్‌ రేట్‌, అల్ట్రా డ్యురెబుల్‌ IP 68 అండర్‌వాటర్‌ ప్రొటెక్షన్‌తో వస్తోంది. అల్ట్రా రిలియబుల్‌ కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ కలిగి ఉంది.

    50 MP ఓఐఎస్‌ సోనీ ఎల్‌వైటీఏఐ 700 సీ ప్రధాన కెమెరా ఏఐ ఫొటో ఎన్‌హాన్స్‌మెంట్‌, హరిజన్‌ లాక్‌, డిజిటల్‌ జూమ్‌ వంటి అదునాతన ఏఐ ఫీచర్లు ప్రొఫెషనల్‌ ఫొటోగ్రఫీ అనుభవాన్ని ఇస్తాయని కంపెనీ పేర్కొంటోంది. ఇది 8 MP సెకండరీ సెన్సార్‌ను కలిగి ఉంది.
    సెల్ఫీలు, వీడియో కాలింగ్‌ కోసం ముందువైపు 32 MP కెమెరాను అమర్చారు.

    5500 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. 33 డబ్ల్యూ టర్బో పవర్‌ చార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తుంది.

    స్నాప్‌డ్రాగన్‌ 7s gen 2 చిప్‌సెట్‌(4nm) అమర్చారు. ఇది మల్టీ టాస్కింగ్‌, గేమింగ్‌కు అద్భుతంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్‌ 15 OSపై పనిచేస్తుంది.

    8GB + 128GB వేరియంట్‌ ధర రూ. 17,999.
    8GB + 256GB వేరియంట్‌ ధర రూ. 19,999.
    ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డుపై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది.

    More like this

    Indian Railway Jobs | పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indian Railway Jobs | భారతీయ రైల్వే(Indian Railway)లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఈస్టర్న్‌...

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...