Homeఆంధప్రదేశ్montha cyclone | ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాను బీభత్సం.. కుండపోతతో జనజీవనం అస్తవ్యస్తం

montha cyclone | ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాను బీభత్సం.. కుండపోతతో జనజీవనం అస్తవ్యస్తం

montha cyclone | మొంథా తుపాను మరింత బలపడే అవకాశం ఉండటంతో అధికారులు హై అలర్ట్ అయ్యారు. మత్స్యకారులు సముద్రంలో వేట‌కి వెళ్లొద్ద‌ని ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయి.

- Advertisement -

అక్షరటుడే, అమరావతి: montha cyclone | కాకినాడ Kakinada – మచిలీపట్నం Machilipatnam మధ్య తీవ్ర తుపాను మొంథా Montha తీరం దాటింది. మచిలీపట్నం – కళింగపట్నం Kalingapatnam మధ్య కాకినాడకు సమీపంలోని నరసాపురానికి దగ్గరలో మంగళవారం రాత్రి 11:30 నుంచి 12:30 మధ్య మొంథా తుపాను తీరం దాటినట్లు ఐఎండీఏ స్ప‌ష్టం చేసింది. తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత జిల్లాలు తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి.

కుండపోత వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో సాధారణ జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు Alluri Seetharamaraju, ప్రకాశం Prakasam, తూర్పు గోదావరి East Godavari జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

montha cyclone | అరకు ఘాట్ రోడ్డుపై రాకపోకల నిలిపివేత‌

అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీ Agency ప్రాంతం తడిసి ముద్దయింది. అరకు వ్యాలీ Araku Valley –విశాఖపట్నం మధ్య ఘాట్ రోడ్డుపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.

సుంకరమెట్ట కాఫీ తోటలు, అనంతగిరి మండలంలోని పలు ప్రాంతాల్లో రోడ్డు పూర్తిగా మునిగిపోయింది. ప్రాణాలను పణంగా పెట్టి కొందరు వాహనదారులు నీటిని దాటి వెళ్లే ప్రయత్నం చేయడం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు అప్రమత్తమై, ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించారు.

ఇదిలా ఉండగా, ప్రకాశం జిల్లాలోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒంగోలు సమీపంలోని యరజర్ల–వెంగముక్కలపాలెం మధ్య వాగు ఉప్పొంగడంతో ఒక కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది.

అకస్మాత్తుగా పెరిగిన వరద నీటికి కారు అదుపుతప్పి వాగులోకి జారిపోయింది. అదృష్టవశాత్తు, డ్రైవరు అప్రమత్తమై వెంటనే కారులో నుంచి బయటకు రావడంతో ప్రాణనష్టం తప్పింది.

సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ NDRF బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో వర్షం కొనసాగుతుండటంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

వాతావరణ శాఖ ప్రకారం, రానున్న 12 నుంచి 18 గంటల వరకు రాష్ట్ర తీరప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదీ తీరాలు, వాగులు, వంకల దగ్గర ప్రయాణాలు చేయవద్దని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

మొంథా తుపాను ప్రభావంతో కాకినాడ, మచిలీపట్నం, తెనాలి, భీమవరం తీరప్రాంతాల్లో గాలుల వేగం గంటకు 80–90 కిమీగా ఉంది. విద్యుత్తు సరఫరా అంతరాయం, చెట్లు, స్తంభాలు కూలిపోవడం వంటి ఘటనలు నమోదయ్యాయి.

Must Read
Related News