అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rajinikanth Birthday | ఎంత ఎదిగిన ఒదిగి ఉండే వ్యక్తులలో రజనీకాంత్ ముందు వరుసలో ఉంటారు. దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా కోట్లాదిమంది అభిమానులకు ఆరాధ్య దైవంగా నిలిచిన రజనీకాంత్ అభిమానుల గుండెల్లో తలైవాగా నిలిచారు.
సామాన్య బస్ కండక్టర్ నుంచి ప్రపంచంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న నటుడుగా పేరు సంపాదించుకున్న రజనీకాంత్ నేడు 75వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఎక్స్ వేదికగా తెలిపిన శుభాకాంక్షలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Rajinikanth Birthday | 75 ఏళ్లు… 50 ఏళ్ల సినీ ప్రయాణం
“రజనీకాంత్ నటన ఎన్నోతరాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది” అని ప్రధాని మోదీ అన్నారు. “తిరు రజనీకాంత్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన నటన తరతరాలను ఆకర్షిస్తోంది. విభిన్న పాత్రలతో ఇండస్ట్రీలో శాశ్వత స్థానాన్ని సొంతం చేసుకున్న ఆయన, అపారమైన ప్రశంసలు అందుకున్నారు” అని పేర్కొన్నారు. అలాగే ఈ సంవత్సరం రజనీ సినీ ప్రయాణంలో ఎంతో ప్రత్యేకమని, సినీ పరిశ్రమలో (Film Industry) 50 ఏళ్లు పూర్తి చేసిన అరుదైన ఘనత ఆయనదేనని గుర్తు చేశారు. “రజనీ గారు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, ఇంకా ఎన్నో సంవత్సరాలు ప్రేక్షకులను అలరించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా” అని మోదీ తెలిపారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ 1975లో సినీ ప్రయాణం ప్రారంభించి నేటికీ అదే జోష్‌తో పెద్ద సినిమాలు చేస్తున్నారు. తమిళ స్టార్ అయినప్పటికీ తెలుగు, హిందీ, కన్నడతో సహా అనేక భాషల్లో ఆయనకు విశేష అభిమానులు ఉన్నారు. ప్రత్యేకంగా ‘రోబో’ చిత్రంతో దేశవ్యాప్తంగా స్టార్‌డమ్‌ను సంపాదించారు. రజనీ పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో (Social Media) సందేశాలు పోస్టు చేశారు. “75 సంవత్సరాల జీవితం.. 50 ఏళ్ల అద్భుతమైన కెరీర్… హ్యాపీ బర్త్‌డే (Happy Birthday) మై ఫ్రెండ్ రజనీకాంత్.” అంటూ కమల్ హాసన్ విష్ చేశారు. ఇక “పుట్టినరోజు శుభాకాంక్షలు తలైవా.” అంటూ ధనుష్ శుభాకాంక్షలు తెలిపారు. సూపర్‌స్టార్ పుట్టినరోజు నేపథ్యంలో సోషల్ మీడియాలో #HBDRajinikanth #HappyBirthdayThalaiva హ్యాష్‌ట్యాగ్‌లు టాప్ ట్రెండింగ్‌లో నిలిచాయి.