అక్షరటుడే, వెబ్‌డెస్క్: Modi on Artificial Intelligence | ఏఐలో విజన్‌తో పాటు సామాజిక బాధ్యత కూడా చాలా ముఖ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. మనం అణుశక్తి విధ్వంసాన్ని చూశాం, వికాసాన్ని చూశామని చెప్పారు. ఏఐ కూడా అంతే అన్నారు. ఏఐ కత్తికి రెండు వైపులా పదునున్న అస్త్రం అని పేర్కొన్నారు. దానిని మంచి కోసం వినియోగించాలని సూచించారు.
ఢిల్లీ (Delhi)లోని భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026) కొనసాగుతోంది. ఈ సదస్సులో గురువారం ప్రధాని మోదీ ‘MANAV విజన్ ఫర్ AI’ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కొత్త సాంకేతికతను భారత్ అందిపుచ్చుకుంటోందని చెప్పారు. ఏఐ సమ్మిట్ నిర్వహణ భారత్‌కే కాదు, దక్షిణాసియాకే గర్వకారణం అన్నారు.
Modi on Artificial Intelligence | యువతలో ఉత్సాహం
ఏఐపై తొలినాళ్లలో అనేక సందేహాలు వచ్చాయని మోదీ అన్నారు. యువత ఇప్పుడు ఏఐని ప్రయోజనకరంగా ఉపయోగిస్తోందని చెప్పారు. ఏఐ సదస్సు మేడిన్ ఇండియా (Made in India), భారత్ సృజనకు వేదికగా నిలిచిందన్నారు. భారతీయ యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోందని తెలిపారు. కొత్త ఆవిష్కరణలకు ఈ వేదిక దోహదం చేస్తుందన్నారు. ఏఐ మెషీన్ సెంట్రిక్‌గా కాదు.. హ్యుమన్ సెంట్రిక్‌గా ఉండాలని ఆయన సూచించారు. కృత్రిమ మేద మనల్ని శాసించొద్దని, మనం దానిని శాసించాలని సూచించారు.
అన్ని రంగాల్లో సమస్యలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) పరిష్కారం చూపిస్తుందన్నారు.21వ శతాబ్దపు AI ఆధారిత ప్రపంచంలో మానవాళి సంక్షేమానికి ఈ దార్శనికత ఒక ముఖ్యమైన లింక్‌గా ఉపయోగపడుతుందని మోదీ అన్నారు. డీప్‌ఫేక్‌లు, కల్పిత కంటెంట్ సమాజాన్ని అస్థిరపరుస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ ప్రపంచంలో కంటెంట్‌కు ప్రామాణికత లేబుల్లు కూడా ఉండాలన్నారు. దీంతో ప్రజలు ఏది నిజమైనది, AIతో దేనిని సృష్టించారో తెలుసుకుంటారని చెప్పారు.