అక్షరటుడే, కామారెడ్డి: MLC Kavitha | జనం బాట కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ, జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) గురువారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు నిజాంసాగర్ మండలంలోని నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (Nagamadugu Lift Irrigation Project) సందర్శించనున్నారు.
11 గంటలకు నిజాంసాగర్ ప్రాజెక్టు (Nizamsagar project) సందర్శన, 12 గంటలకు బాన్సువాడ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల సందర్శించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నాగిరెడ్డిపేట మండలంలో (Nagireddypet mandal) ముంపు రైతులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3:30 గంటలకు లింగంపేటలో గాంధీజీ, అంబేడ్కర్ విగ్రహాలకు నివాళులర్పిస్తారు.
సాయంత్రం 4 గంటలకు చరిత్రాత్మక నాగన్న బావిని సందర్శిస్తారు. 4:30 గంటలకు తాడ్వాయి మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. సాయంత్రం 6 గంటలకు కామారెడ్డి పట్టణంలో కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహానికి నివాళులర్పిస్తారు. వాగులో పడి మృతి చెందిన గొర్ల కాపరి సుధాకర్ కుటుంబాన్ని రాత్రి 7 గంటలకు కవిత పరామర్శిస్తారు.