అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLC Kavitha Suspention | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై (MLC Kalvakuntla Kavitha) బీఆర్ఎస్ పార్టీ వేటు వేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎమ్మెల్సీ కవిత గత కొంతకాలంగా బీఆర్ఎస్కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. పార్టీలోని పలువురు నేతలను ఉద్దేశిస్తూ ఆమె వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో తన తండ్రికి రాసిన లేఖ బయటకు విడుదల కావడంతో కేసీఆర్ (KCR) చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ ఆమె విమర్శించారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలని చూశారని ఆమె గతంలో బాంబు పేల్చారు. బీఆర్ఎస్లో కేసీఆర్ మాత్రమే బాస్ అని పరోక్షంగా తన అన్న కేటీఆర్ (KTR) నాయకత్వాన్ని అంగీకరించేది లేదని వ్యాఖ్యలు చేశారు.
MLC Kavitha Suspention | హరీశ్‌రావుపై వ్యాఖ్యలతో..
కవిత కొంతకాలం క్రితం సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై (MLA Jagadish Reddy) సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పలు సందర్భాల్లో పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడిన పార్టీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఆమె కాళేశ్వరంపై (Kaleshwaram) మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao), మాజీ ఎంపీ సంతోష్‌రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం అవినీతి వారే కారణమని, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై డబ్బులు దోచుకున్నారని ఆరోపించారు. వారి తీరుతో కేసీఆర్‌కు మరకలు అంటాయన్నారు. పార్టీ ఏమైపోయినా పర్వాలేదని ఆమె వ్యాఖ్యానించారు.
MLC Kavitha Suspention | కార్యకర్తల ఆగ్రహం
ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి. ఆమె తీరుపై బీఆర్ఎస్ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరగలేదని బీఆర్ఎస్ (BRS Party) చెబుతుంటే.. స్వయంగా కేసీఆర్ కుమార్తె కవిత అవినీతి జరిగిందని ఒప్పుకోవడంతో కార్యకర్తలు, నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం రాత్రి ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. మంగళవారం మరోసారి సమావేశం నిర్వహించి కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
MLC Kavitha Suspention | ప్రాంతీయ పార్టీల్లో గతంలో సైతం
ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు రావడంతో గతంలో సైతం కుటుంబ సభ్యులను బహిష్కరించారు. శివసేన అధినేత బాల్ థాకరే (Shiv Sena chief Bal Thackeray) తన అన్న కుమారుడు రాజ్ థాకరేను 2005లో సస్పెండ్ చేశారు. ములాయం సింగ్ యాదవ్ తన కుమారుడు అఖిలేష్ యాదవ్‌ను 2016లో పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ సమయంలో అఖిలేష్ సీఎంగా ఉండటం గమనార్హం.