అక్షరటుడే, ఆర్మూర్ : Sammakka Sarakka Jathara | ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన మహోత్సవమైన సమ్మక్క సారక్క జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. తెలంగాణలోని (Telangana) ములుగు జిల్లా (Mulugu District) మేడారంలో ప్రతి రెండేళ్లకొకసారి కోయ తెగ ఆచారాల ప్రకారం ఈ జాతరను నిర్వహిస్తుంటారు.
Sammakka Sarakka Jathara | ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కుటుంబం..
ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి (MLA Rakesh Reddy) తన సతీమణి పైడి రేవతి రెడ్డి (Paidi Revathi Reddy), కుమార్తె సుచరిత రెడ్డితో కలిసి శనివారం మేడారం వెళ్లారు. ఆదివాసీ గిరిజన వన దేవతలైన సమ్మక్క సారక్క దేవతలను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో నిలువెత్తూ బంగారంతో మొక్కులు చెల్లించుకున్నారు.
Sammakka Sarakka Jathara | ప్రకృతితో ముడిపడి ఉన్న ఉత్సవం..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన వన మహోత్సవం సమ్మక్క సారక్క జాతర అని అన్నారు. జాతర మొత్తం ప్రకృతితో ముడిపడి పవిత్రంగా మారిందన్నారు. సమ్మక్క-సారలమ్మలకు భక్తులు తమ బరువుకు సమానమైన బెల్లాన్ని (బంగారం) కానుకగా సమర్పిస్తున్నారని.. తానసైతం మొక్కలు చెల్లించుకున్నానని వివరించారు. కార్యక్రమంలో పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ డైరెక్టర్ పైడి సుజాత రెడ్డి, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
