అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jagtial MLA Sanjay | పార్టీ ఫిరాయింపుల కేసులో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కు స్పీకర్ ఊరట ఇచ్చారు. ఆయనపై అనర్హత పిటిషన్‌ను కొట్టివేశారు.
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ అనంతరం కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (MLA Jagadish Reddy) వేసిన అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గతంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ (Speaker Gaddam Prasad Kumar) విచారణ చేపట్టారు. తాజాగా తీర్పు వెల్లడించారు. అనర్హత పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. సంజయ్ పార్టీ మారారు అనడానికి సరైన ఆధారాలు లేవన్నారు.
Jagtial MLA Sanjay | 8 మందికి క్లీన్చిట్..
పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు బీఆర్ఎస్ అనర్హత పిటిషన్లు దాఖలు చేసింది. ఇందులో ఇప్పటికే 9 మంది విచారణ పూర్తయింది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (MLA Kadiyam Srihari)ని విచారణ నేడు సాగనుంది. కాగా స్పీకర్ 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్చిట్ ఇచ్చారు. వారు ఇంకా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. దానం నాగేందర్ (Danam Nagender) పిటిషన్‌పై తీర్పు పెండింగ్‌లో ఉండగా.. కడియం శ్రీహరిని నేడు విచారించనున్నారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య, సంజయ్ కుమార్‌లకు స్పీకర్ అనర్హత పిటిషన్లో ఊరట ఇచ్చారు.
Jagtial MLA Sanjay | బీఆర్ఎస్లోనే ఉన్నా
సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. తాను బీఆర్ఎస్లోనే ఉన్నట్లు చెప్పారు. తన జీతం నుంచి ప్రతి నెల రూ.5 వేలు బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఫండ్ కింద జమ అవుతున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో బిల్లులు ప్రవేశ పెట్టిన సమయంలో బీఆర్ఎస్ విప్ జారీ చేస్తే మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు. తానెప్పుడు బీఆర్ఎస్ నాయకులను విమర్శించలేదని, స్థానిక పార్టీ నాయకులు తనకు దూరంగా ఉంటున్నారని చెప్పుకొచ్చారు. అభివృద్ధి కోసం సీఎం, కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)తో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు.