అక్షరటుడే, వెబ్డెస్క్: Lawyer Murder Case | రంగారెడ్డి జిల్లా (Rangareddy District)లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళా న్యాయవాదిని దుండగులు మెడపై నరికి హత్య చేశారు.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ శివారులోని పొలం వద్ద చేవెళ్ల కోర్టు (Chevella Court)లో ప్రాక్టీస్ చేస్తున్న స్వప్న (34) అనే న్యాయవాది హత్య జరిగింది. ఆమె పొలం వద్ద హత్యకు గురవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే ఆమెను సొంత అన్ననే హత్య చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ, ఆస్తి తగదాలే ఈ హత్యకు కారణమని సమాచారం.
స్వప్న చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తోంది. ఆమెకు తన సోదరుడితో ఆస్తి తగాదాలు ఉన్నాయి. మొయినాబాద్ మండలం (Moinabad Mandal) కేతిరెడ్డిపల్లిలో బుధవారం పొలం వద్ద పంచాయితీ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన అతడు స్వప్నను దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రి (Government Hospital)కి తరలించారు.
కాగా స్వప్న హత్యపై చేవేళ్ల కోర్టు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ (Moinabad Police Station) ఎదుట ఆందోళన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.