అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jagityal Jeevan Reddy | జగిత్యాల (Jagityal) కాంగ్రెస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే సంజయ్ (MLA Sanjay), మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మధ్య విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
ఇద్దరు నాయకుల మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి ఎమ్మెల్యేలపై అనేక సార్లు విమర్శలు చేశారు. ఇటీవల మున్సిపల్ టికెట్ల కేటాయింపులో సైతం జీవన్‌రెడ్డి వర్గానికి అన్యాయం జరిగినట్లు సమాచారం. జీవన్‌రెడ్డి వర్గానికి 20 టికెట్లు ఇవ్వగా.. ఎమ్మెల్యే వర్గానికి 30 టికెట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో జీవన్‌రెడ్డి అనుచరులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో బుధవారం జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Jagityal Jeevan Reddy | స్పీకర్ తీర్పుపై..
ఎమ్మెల్యే సంజయ్‌పై అనర్హత పిటిషన్‌ను స్పీకర్ ప్రసాద్ కుమార్ (Speaker Prasad) బుధవారం కొట్టి వేసిన విషయం తెలిసిందే. ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ సైతం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పారు. అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నానని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై జీవన్ రెడ్డి స్పందించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అనడం సంతోషం అన్నారు. ‘‘నీ సంసారం నువ్వు చక్కగా చేసుకోకుండా.. నా సంసారంలో చిచ్చు పెట్టాలని ఎందుకు చూస్తున్నావయ్యా” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా బుద్దిగల ఇల్లాలిగా మంచిగా సంసారం చేసుకోవాలని హితవు పలికారు.