అక్షరటుడే, బాల్కొండ : Balkonda Congress | నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి (MLA Prashanth Reddy) కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌గౌడ్ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి.. బాల్కొండ నియోజకవర్గ (Balkonda Constituency) కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి సునీల్ రెడ్డిపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు.
Balkonda Congress | ఆరెంజ్ ట్రావెల్స్ అంశం వ్యక్తిగతం..
ఆరెంజ్ ట్రావెల్స్‌కు (Orange Travels) సంబంధించి జీఎస్టీ అంశం చట్టపరిధిలో విచారణ జరుగుతున్న సందర్భంలో సునీల్ రెడ్డిపై ప్రశాంత్ రెడ్డి చౌకబారు ఆరోపణలు చేశారన్నారు. నిజానిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందన్నారు. బాల్కొండ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఆధ్వర్యంలో సునీల్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. అభివృద్ధి జరగకుండా అనవసర రాజకీయ ఆరోపణలు చేయకుండా ప్రజల సమస్యలు అభివృద్ధి సంక్షేమంపై దృష్టిపెడితే బాగుంటుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్, కాంగ్రెస్ మెండోరా మండల అధ్యక్షుడు కొత్తింటి ముత్యం రెడ్డి, వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్, కాంగ్రెస్ వేల్పూర్ మండల అధ్యక్షుడు నర్సారెడ్డి, బాల్కొండ, ముప్కాల్ మండల అధ్యక్షులు గున్నాల వెంకటేష్ గౌడ్, మగిడి ముత్యం రెడ్డి, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.