అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉన్నారని.. ఆయన వర్గీయులు పేర్కొన్నారు. తెలంగాణలో ఎక్కడా జరగని అభివృద్ధి బాన్సువాడ నియోజకవర్గంలో (Banswada Constituency) జరిగిందని వివరించారు. పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ (BajiReddy Govardhan) బాన్సువాడలో 2009లో ఓడిపోయి ముఖం చాటేశారని నాయకులు అన్నారు. ఇప్పుడు నియోజవర్గానికి వచ్చి ఎమ్మెల్యే పోచారంపై (MLA Pocharam) లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. 2004లో బాన్సువాడకు వచ్చిన బాజిరెడ్డి నియోజకవర్గాన్ని రాయలసీమగా మార్చారని విమర్శించారు.
ప్రభుత్వం మారి అభివృద్ధి పనుల బిల్లులు నిలిచిపోవడంతో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సీఎంను కలిశారని వివరించారు. ఫలితంగా నిలిచిపోయిన రూ.100 కోట్ల బిల్లులు మంజూరయ్యయని గుర్తు చేశారు. ఈ 16 నెలల్లో నియోజకవర్గానికి రోడ్ల అభివృద్ధికి రూ.150 కోట్ల నిధులు తీసుకొచ్చారని పేర్కొన్నారు.
తిమ్మాపూర్ వేంకటేశ్వర ఆలయ అభివృద్ధి ఎమ్మెల్యే పోచారం వల్లే సాధ్యమైందన్నారు. పోచారం ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో బాన్సువాడ సొసైటీ ఛైర్మన్ ఎర్వల కృష్ణారెడ్డి, గురు వినయ్, ఒడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నార్ల సురేష్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, ఎజాజ్, ఖాలెక్, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
