ePaper
More
    HomeతెలంగాణPadi Kaushik Reddy | ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డికి రిమాండ్​

    Padi Kaushik Reddy | ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డికి రిమాండ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Padi Kaushik Reddy | హుజురాబాద్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డికి గట్టి షాక్ తగిలింది. డబ్బులు డిమాండ్ చేసిన కేసులో ఆయనకు కోర్టు రిమాండ్​ విధించింది.

    బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) కౌశిక్ రెడ్డిని వరంగల్ పోలీసులు శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయనను వరంగల్‌లోని సుబేదారి పోలీస్ స్టేషన్‌ (Subedari Police Station)కు తరలించారు. శనివారం సాయంత్రం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి 14 రిమాండ్​ విధించారు. కాసేపట్లో ఆయన్ను పోలీసులు ఖమ్మం జైలుకు తరలించనున్నారు.

    కమలాపురం (Kamalapur) మండలం వంగపల్లిలోని క్వారీ నిర్వహిస్తున్న గ్రానైట్ వ్యాపారి కుటుంబం కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రూ.50 లక్షలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కౌశిక్ రెడ్డిపై సుబేదారి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే తనపై కేసు కొట్టివేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్​ను హైకోర్టు (High Court telangana) తోసిపుచ్చడంతో పోలీసులు అరెస్ట్​ చేశారు.

    More like this

    Alumni reunion | 14న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, భిక్కనూరు: Alumni reunion | మండలంలో జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం...

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల (Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ...

    KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ అని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల...