అక్షరటుడే, ఎల్లారెడ్డి : Pocharam Project | పోచారం ప్రాజెక్టును ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ (Mla Madan Mohan) శుక్రవారం సందర్శించారు. నాగిరెడ్డిపేట్ మండలంలోని 103 ఏళ్ల ఈ ప్రాజెక్టు ఇటీవల 1.83 లక్షల క్యూసెక్కుల వరదనీటిని సైతం ఎదుర్కొని నిలబడింది.
అయితే ప్రాజెక్టు వద్ద మట్టికొట్టుకుపోయింది. దీంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ఆ ప్రాంతంలో ఇసుక సంచులను వేసి గుంతను పూడ్చివేస్తున్నారు.
ప్రాజెక్టు వద్ద సుమారు 800 ఇసుక సంచులను వేయించారు. దీంతో ప్రాజెక్టుపై ఒత్తిడి తగ్గించారు. రెండురోజుల నుంచి ప్రాజెక్టు వద్ద భారీ గుంతను పూడ్చేందుకు కృషి చేస్తున్న సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి నియోజకవర్గ(Yellareddy Constituency) ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వరద నష్టం వివరాలను, నష్టపరిహారం, రైతుల సమస్యలను ప్రస్తావిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఈ, డీఈఈ, ఆర్డీవో, డీఎస్పీ, ఎస్డీఆర్ఎఫ్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.