7
అక్షరటుడే, ఎల్లారెడ్డి : Mla Madan Mohan | ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు సీఎం రేవంత్‌రెడ్డిని (Cm revanth Reddy) మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని సీఎం కార్యాలయంలో కలిసి నియోజకవర్గంలో (Yellareddy constituency) జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, వాటి పురోగతిని వివరించారు.
మైనర్ ఇరిగేషన్ వ్యవస్థలు (Minor irrigation) పూర్తిగా దెబ్బతిన్న కారణంగా వాటిని తక్షణమే పునరుద్ధరించాలని సీఎంను అభ్యర్థించారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు అదనపు నిధులు మంజూరు చేయాలని కోరారు.
అదనంగా ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Housing Scheme) మంజూరు చేయాలని కోరగా, సీఎం సానుకూలంగా స్పందించి, అవసరమైన నిధులను త్వరితగతిన విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.