HomeతెలంగాణPadi Kaushik Reddy | అధికారులకు ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి వార్నింగ్

Padi Kaushik Reddy | అధికారులకు ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి వార్నింగ్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Padi Kaushik Reddy | ప్రభుత్వ అధికారులకు హుజురాబాద్​(Huzurabad) ఎమ్మెల్యే పాడి కౌశిక్​ రెడ్డి (MLA Padi Kaishik Reddy) వార్నింగ్​ ఇచ్చారు. ప్రభుత్వ​ అధికారులు ఎక్స్​ట్రాలు చేయకుండా పనులు చేయాలన్నారు. “మీరేం కాంగ్రెస్ కండువా కప్పుకున్న కార్యకర్తలు కాదు” అన్నారు. పేదవాళ్ల జీవితాలతో చెలగాటం ఆడొద్దని, ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తే మంచిది కాదన్నారు. ఇటీవల మంత్రి సీతక్క (Minister seethakka) తీరుతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని కౌశిక్​ రెడ్డి ఆరోపించారు. ఆ యువకుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. సెల్ఫీ వీడియో రికార్డ్​ చేసి ఆ యువకుడు ఆత్మహత్య చేసుకుంటే పోలీసులు వెళ్లి దానిని డిలీట్​ చేశారని ఆరోపించారు.

Padi Kaushik Reddy | ఇళ్లు క్యాన్సిల్​ చేస్తే ఊరుకోం

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 40 వేల మందికి ఇందిరమ్మ ఇళ్లకు (Indiramma illu) అర్హత ఉందని కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పిందని కౌశిక్​రెడ్డి అన్నారు. అయితే కొంత మందికే ప్రోసిడింగ్​లు ఇచ్చారని పేర్కొన్నారు. తర్వాత కొందరి ప్రోసిడింగ్​లను అధికారులు రద్దు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోసిడింగ్​లు ఎందుకు రద్దు చేస్తున్నారని ప్రశ్నించారు. ఏమన్నా ఉంటే తనతో తేల్చుకోవాలని, ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని సవాల్​ విసిరారు. ముగ్గు పోసుకున్నాక ప్రోసిడింగ్​లు రద్దు చేస్తూ ఊరుకునేది లేదని కౌశిక్​రెడ్డి హెచ్చరించారు.

Must Read
Related News