అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | పట్టణంలో ఈనెల 24న రేణుక ఎల్లమ్మ జమదగ్ని–చింతల పోచమ్మ విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ (Ministers Ponnam Prabhakar Goud), సీతక్క (Minister Seethakka), వాకిటి శ్రీహరిలకు ఆహ్వాన పత్రికను అందజేసినట్లు ఎల్లారెడ్డి గౌడ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు.
హైదరాబాద్లోని (Hyderabad) మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఆయనను శనివారం కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 24 నుండి 28 వరకు నిర్వహించే విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు బ్రాహ్మణ పురోహితులతో పూజా కార్యక్రమాలు, ఎల్లమ్మ తల్లి బోనాలు (Yellamma Thalli Bonalu) తదితర కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మంత్రులకు ఆహ్వానపత్రిక అందజేసిన వారిలో పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ ప్రశాంత్ గౌడ్, బాలకిషన్, శ్రీనివాస్ గౌడ్, ఈశ్వర్ గౌడ్, కిషన్ గౌడ్, నారా గౌడ్, సిద్ధాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.