ePaper
More
    Homeటెక్నాలజీMG Windsor EV Pro | బిగ్‌ బ్యాటరీతో విండ్‌సోర్‌ ప్రో కారు.. సింగిల్‌ ఛార్జింగ్‌తో...

    MG Windsor EV Pro | బిగ్‌ బ్యాటరీతో విండ్‌సోర్‌ ప్రో కారు.. సింగిల్‌ ఛార్జింగ్‌తో 449 కిలోమీటర్లు.. ధర ఎంతంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: MG Windsor EV Pro | ప్రముఖ కార్ల తయారీ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా (JSW MG Motor India) తన అధునాతన ఎలక్ట్రిక్‌ క్రాస్‌ఓవర్‌ యుటిలిటీ వెహికల్‌(సీయూవీ) MG Windsor EV Pro వర్షన్‌ను తీసుకువచ్చింది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 449 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. సెల్‌డాన్‌ బ్లూ, ఆరా సిల్వర్‌, గ్లేజ్‌ రెడ్‌ రంగుల్లో లభిస్తుంది. గురువారం నుంచి బుకింగ్‌(Booking) ప్రారంభం కానున్న ఈ మోడల్‌ కారు ధరను రూ.17.49 లక్షలు(ఎక్స్‌షోరూం)గా నిర్ణయించింది. అయితే ఈ ధర పరిమిత కాలానికేనని పేర్కొంది. తొలి 8 వేల మంది కస్టమర్లకు మాత్రమే ఈ ధరకు విక్రయిస్తామని ప్రకటించింది. ఆ తర్వాత ధర పెరిగే అవకాశాలున్నాయి.

    MG Windsor EV Pro | ప్రత్యేకతలు..

    జేఎస్‌డబ్ల్యూ ఎంజీ (JSW MG) తొలి విండ్‌సోర్‌ ఈవీని గతేడాది లాంచ్‌ చేసింది. దానికి మంచి స్పందన రావడంతో ప్రో వర్షన్‌ను తీసుకువచ్చింది. ఇది చూడటానికి స్టాండర్డ్ (Standard) వెర్షన్ లాగే ఉన్నా.. కొత్త అల్లాయ్ వీల్స్ (Alloy wheels), టెయిల్‌గేట్‌పై ఏడీఏఎస్ బ్యాడ్జ్, లైట్ కలర్ ఇంటీరియర్ వంటి అప్‌డేట్స్‌ ఉన్నాయి. ట్రాఫిక్‌ జామ్‌ అసిస్ట్‌ (traffic jam assist), అడాప్టివ్‌ క్రూజ్‌ కంట్రోల్‌ వంటి లెవల్‌ 2 అడాస్‌ ఫీచర్లతో విండ్‌సోర్‌ ప్రో వస్తోంది. అలాగే వెహికల్‌ టు లోడ్‌ ద్వారా కారు పవర్‌ను (car power) ఇతర డివైజులకు అందించొచ్చు. వెహికల్‌ టు వెహికల్‌ సదుపాయం ద్వారా ఇతర వాహనాలతో పవర్‌(Power)ను పంచుకోవచ్చు. కొత్తగా ఈ రెండు ఫీచర్లను ప్రో వెర్షన్‌ (Pro version)లో చేర్చారు. పనోరమిక్ గ్లాస్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ప్రీమియం ఇన్ఫినిటీ 9 స్పీకర్ ఆడియో సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ ప్యూరిఫైయర్ వంటివి ఉన్నాయి.

    MG Windsor EV Pro | బ్యాటరీ సామర్థ్యం..

    స్టాండర్డ్‌ వేరియంట్‌లో 38 kWh బ్యాటరీ ఉపయోగించగా.. ప్రో వేరియంట్‌ బ్యాటరీ సామర్థ్యం 52.9 kWh వాడారు. స్టాండర్డ్‌ వేరియంట్‌ సింగిల్ చార్జ్‌తో 332 కిలోమీటర్ల రేంజ్‌తో రాగా.. ప్రో వెర్షన్‌ (Pro version) మరింత పెద్ద బ్యాటరీని కలిగి ఉండడంతో సింగిల్‌ చార్జ్‌ (Single charge)తో 449 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులోని ఎలక్ట్రిక్‌ మోటార్‌ (electric motor) 136 HP పవర్‌ను, 200 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

    More like this

    Local Body Elections | స్థానిక ఎన్నికలపై కీలక అప్​డేట్​.. రిజర్వేషన్ల పెంపునకు గవర్నర్​ ఆమోదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్​డేట్​ వచ్చింది. బీసీ...

    Sriram Sagar | శ్రీరాంసాగర్ వరద గేట్ల మూసివేత

    అక్షరటుడే, బాల్కొండ: Sriram Sagar | తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి (Sriram Sagar Project) వరద తగ్గుముఖం...

    Yellareddy | చెరువు బాగు కోసం రైతులంతా ఏకమయ్యారు..

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా గ్రామస్థులు తమ చెరువును...