అక్షరటుడే, కమ్మర్పల్లి : Metpally Degree College | మెట్పల్లి డిగ్రీ కళాశాలలో సకల సౌకర్యాలున్నాయని ఆ కళాశాల ప్రిన్సిపాల్ కె. వెంకయ్య అన్నారు. ఈ మేరకు గురువారం కమ్మర్పల్లి మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (Government Junior College)లో అడ్మిషన్ డ్రైవ్ చేపట్టారు.
Metpally Degree College | అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతాం..
తమ డిగ్రీ కళాశాలలో చేరిన విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చదిద్దుతామని ప్రిన్సిపాల్ వెంకయ్య అన్నారు. తమ డిగ్రీ కళాశాలలో సకల సౌకర్యాలు ఉన్నాయని వివరించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ దేవన్న మాట్లాడుతూ.. విజ్ఞానాన్ని అందించి, ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో కమ్మర్పల్లి (Kammarpalli) జూనియర్ కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ మధు కుమార్, వైష్ణవి, వెంకటేష్, గంగాధర్, ఆనంద్ కుమార్, మురళి, సుమతి తదితరులతో పాటు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
