HomeసినిమాMana Shankar Varaprasad Garu | ‘మీసాల పిల్ల’ ఫుల్ సాంగ్ విడుద‌ల‌.. ఫ్యాన్స్ ఆనందానికి...

Mana Shankar Varaprasad Garu | ‘మీసాల పిల్ల’ ఫుల్ సాంగ్ విడుద‌ల‌.. ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధుల్లేవుగా..!

Mana Shankar Varaprasad Garu | మెగాస్టార్ చిరంజీవి – నయనతార జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌ గారు’. ఈ చిత్రం నుంచి తాజాగా ‘మీసాల పిల్ల’ ఫుల్ సాంగ్ రిలీజైంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mana Shankar Varaprasad Garu | మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, లేడీ సూపర్‌స్టార్ నయనతార కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’ (Mana Shankar Varaprasad Garu) సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వం (Director Anil Ravipudi) వహించగా, సుష్మిత కొణిదెల మరియు సాహు గారపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘మీసాల పిల్ల’ సాంగ్ ప్రోమో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను తెచ్చుకుంది. చిరంజీవి ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌, నయనతార గ్లామర్‌, భీమ్స్ సిసిరీలియో అందించిన మ్యూజిక్ ఇవన్నీ కలిపి పాటకు భారీ హైప్‌ క్రియేట్ చేశాయి.

Mana Shankar Varaprasad Garu | చిరంజీవి – ఉదిత్ నారాయణ కాంబినేషన్ మళ్లీ!

ఈ పాటకు ఉదిత్ నారాయణ్, తన గళాన్ని అందించారు. చాలా కాలం తర్వాత చిరంజీవి కోసం ఉదిత్ పాడిన పాట కావడంతో మెగా అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహం నెలకొంది. గతంలో ఆయన ‘కైకలూరి కన్నేపిల్లా’, ‘రామ్మా చిలకమ్మా’, ‘వానా వానా’, ‘రాధే గోవింద’ వంటి సూపర్‌హిట్ సాంగ్స్‌తో మెగా ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పుడు ‘మీసాల పిల్ల’ (Meesala Pilla Song) కూడా అదే స్థాయిలో రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మొదటి పాట ఫుల్ సాంగ్​ను రెండ్రోజుల క్రితం విడుదల చేయాల్సి ఉన్నా, కొన్ని కారణాల వలన వాయిదా పడింది. తాజాగా మేకర్స్ సోషల్ మీడియాలో విడుద‌ల చేశారు. మీ వెయిటింగ్‌కి పుల్​స్టాప్​ పెట్టండి అంటూ సాంగ్ రిలీజ్ చేశారు.

ప్రతి భర్త, భార్య ఈ పాటతో కనెక్ట్ అవుతారు అని చిత్ర బృందం ఆశాభావం వ్య‌క్తం చేస్తుంది. ఫుల్ వీడియో సాంగ్ కూడా అదిరిపోయింది. చూస్తుంటే సినిమా కూడా సూప‌ర్ డూపర్ హిట్ కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక ఇదిలా ఉంటే సంక్రాంతి బరిలో మెగా సినిమాలకే ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే ‘మన శంకర వరప్రసాద్‌గారు’పై అంచనాలు భారీగా ఉన్నాయి. మ‌రోవైపు చిరంజీవి న‌టించిన విశ్వంభ‌ర చిత్రం కూడా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో రిలీజ్ చేయ‌నున్నారు. ఈ చిత్రంపై కూడా ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు.