అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Meenakshi Chowdary | తెలుగు ప్రేక్షకుల మనసులను “ఇచట వాహనములు నిలుపరాదు” సినిమాతో గెలుచుకున్న ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary)ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటోంది.
టాలీవుడ్‌లో “లక్కీ భాస్కర్” సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ అందాల భామ, ఇటీవలే “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయం తరువాత మీనాక్షికి టాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు వచ్చే అవకాశం కనిపించినా, ఆమె మాత్రం పెద్దగా కొత్త ప్రాజెక్టులను కమిట్ కావడం లేదు.
Meenakshi Chowdary | బాలీవుడ్ డెబ్యూట్
తాజా సమాచారం ప్రకారం, మీనాక్షి చౌదరి బాలీవుడ్(Bollywood)లో జాన్ అబ్రహాం హీరోగా నటిస్తున్న “ఫోర్స్ 3” సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను భావ్ ధులియా దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌కి చెందిన పలువురు నటీమణులను పరిశీలించిన తర్వాత, చివరికి మేకర్స్ మీనాక్షిని సెలెక్ట్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాతో మీనాక్షి హిందీ చిత్ర పరిశ్రమలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ వార్తపై మీనాక్షి అభిమానులలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఓవైపు బాలీవుడ్ ఎంట్రీ ఈ ముద్దుగుమ్మకు గుడ్ న్యూస్ అయినా, మరోవైపు టాలీవుడ్‌లో మంచి హైప్ ఉన్న సమయంలో, బాలీవుడ్‌కి, అదీ పెద్దగా క్రేజ్ లేని జాన్ అబ్రహాం సరసన నటించడాన్నికొందరు తప్పుపడుతున్నారు. మీనాక్షి తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన నటించే స్థాయిలో ఉన్నప్పటికీ, ఈ నిర్ణయం ఆమె కెరీర్‌ను ఏ దిశగా తీసుకెళ్తుందోనన్న సందేహం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం మీనాక్షి, నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty)తో కలిసి “అనగనగా ఒక రాజు” సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తై, 2026 సంక్రాంతి విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌పై మీనాక్షి మంచి ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో మంచి విజయం దక్కుతుందని భావిస్తున్న ఆమె, ఇతర సినిమాల ఎంపిక లో ఏ మాత్రం తొందరపడటం లేదు . అయితే తాజా పరిస్థితులను గమనిస్తే, మీనాక్షి బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో అనేక దక్షిణాదికి చెందిన నాయికలు బాలీవుడ్‌లో అడుగుపెట్టి మంచి గుర్తింపు పొందారు. కానీ తొలి సినిమానే మంచి స్థాయిలో ఉండకపోతే, బాలీవుడ్‌లో నిలదొక్కుకోవడం కష్టం. జాన్ అబ్రహాం సరసన ఓ యాక్షన్ డ్రామా ఆమెకు ఎంత మేర ఫలితం ఇస్తుందో వేచి చూడాలి.