అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Union Ministers at Medaram | మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) కోరారు. కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy), కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్ ఓరమ్ గురువారం జాతరను సందర్శించారు. వారికి మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి పొంగులేటి స్వాగతం పలికారు.
కేంద్ర మంత్రులు అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నిలువెత్తు బంగారం సమర్పించి తమ మొక్కులు చెల్లించారు. పొంగులేటి మాట్లాడుతూ.. కుంభమేళాను తలపించే విధంగా సమ్మక్క సారలమ్మ జాతరను నిర్వహిస్తున్నామన్నారు. భక్తుల కోసం శాశ్వతమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు. సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించే విషయమై ప్రధానితో చర్చించాలని కోరారు.
Union Ministers at Medaram | జాతర అభివృద్ధికి సహకారం
ప్రధానమంత్రి ఆదేశాల మేరకు మేడారం జాతర (Medaram Jathara) అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని కిషన్ రెడ్డి, జుయల్ ఓరమ్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ గిరిజనుల సైతం మేడారం మహా జాతర గురించి తెలుసుకోవాలన్నారు.
Union Ministers at Medaram | భారీగా భక్తుల రద్దీ
మేడారం మహాజాతరలో భక్తుల తాకిడి గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని పొంగులేటి అన్నారు. గురువారం దాదాపు 80 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపారు. మేడారానికి ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం,దాని ప్రకారం అంతర్గత రోడ్ల అభివృద్ధి, ఎకో పార్కుల ఏర్పాటు, పర్యాటక సౌకర్యాల విస్తరణ చేస్తామన్నారు.