అక్షరటుడే, వెబ్డెస్క్: Medaram Jathara festival | మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. గద్దెలపై కొలువైన వన దేవతలను దర్శించుకుని తరించేందుకు భారీగా భక్తులు తరలొచ్చారు. సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు ఓ వైపు భక్తుల రాక.. మరో వైపు వన దేవతల దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఉన్న భక్తులతో రహదారులు పూర్తిగా నిండిపోయాయి. దీంతో ఏ మార్గంలో చూసినా వాహనాల రద్దీతో ట్రాఫిక్ జామ్ కావడం గమనార్హం.
Medaram Jathara festival | భారీగా ట్రాఫిక్ జామ్..
మేడారం మార్గంలో ఉన్న గోవిందరావుపేట మండలం పసర నుంచి పసర ద్వారం వరకు పెద్ద మొత్తంలో వాహనాలు నిలిచిపోయాయి. తాడ్వాయి నుంచి మేడారం మార్గంలో అయితే ఏకంగా దాదాపు 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినట్లు స్థానికులు తెలిపారు. రోడ్డుపై వాహనాలు వరుస కట్టి, గంటల తరబడి నిలిచిపోవడం, నెమ్మదిగా కదులుతుండటంతో ప్రయాణికులు, భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.