అక్షరటుడే, వెబ్‌డెస్క్: MP Raghunandan Rao | బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) బెదిరింపు కాల్ (threat call) వచ్చింది. తాను మధ్యప్రదేశ్‌కి (Madhya Pradesh) చెందిన మావోయిస్టునంటూ.. ఆగంతకుడు ఫోన్లో పరిచయం చేసుకున్నాడు. సాయంత్రం వరకు చంపేస్తామని హెచ్చరించాడు. దమ్ముంటే.. నిన్ను నువ్వు కాపాడుకో అంటూ సవాల్ విసిరాడు. దీంతో రఘునందర్రావు వెంటనే డీజీపీ, సంగారెడ్డి ఎస్పీలకు ఫోన్లో ఫిర్యాదు చేశారు.