అక్షరటుడే, ఇందూరు:Municipal Workers | మే డే వాల్పోస్టర్లను(May Day wall posters) తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఐ(TUCI) జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, యూనియన్ రాష్ట్ర నాయకులు రవికిరణ్, ఎన్.రవి మాట్లాడుతూ.. ప్రభుత్వాలు కార్మికుల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ఆరోపించారు. ఉద్యోగ, ఆరోగ్య భద్రత గాలికి వదిలేశారన్నారు. మున్సిపల్ కార్మికులకు(municipal workers) రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ డ్రైవర్లు, కార్మికులు రాము, శాంతి కుమార్, విజయ్, లక్ష్మణ్, సంతోష్, సాయిలు, నరేష్, భూపతి, జగదీష్, గంగామణి, యాదమ్మ, శైలజ, శ్రీధర్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.