Homeబిజినెస్​Gold Rates Today | నేడు బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయి.. హైద‌రాబాద్‌లో ప‌సిడి ధర...

Gold Rates Today | నేడు బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయి.. హైద‌రాబాద్‌లో ప‌సిడి ధర ఎంత…?

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Rates Today | మ‌హిళ‌ల‌కి బంగారం కొనుక్కోవాల‌నే క‌ల ఎక్కువ‌. ఎంత బంగారం ఉన్నా కూడా ఇంకా కావాల‌ని అనుకుంటారు. అయితే ఇప్పుడు ప‌సిడి కొనే ప‌రిస్థితి లేదు.

ల‌క్ష వ‌ర‌కు టచ్ అయిన బంగారం ధ‌ర‌లు ఇప్పుడిప్పుడే కాస్త త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. దేశంలో పసిడి ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. నేడు (Gold Rates on May, 29, 2025) 10 గ్రాముల 24 క్యారెట్‌ల మేలిమి బంగారం ధర సుమారు రూ.10 మేర తగ్గి 97,620కు చేరుకుంది. 22 క్యారెట్‌ల 10 గ్రాముల బంగారం కూడా స్వల్పంగా తగ్గి 89,490కు చేరుకుంది. ఇక 18 క్యారెట్‌ల బంగారం కూడా స్వల్పంగా తగ్గ‌డంతో మ‌హిళ‌లు హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.73,220గా ఉంది. ఇక కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.100 మేర తగ్గి రూ 99,900కు చేరుకుంది.

Today gold price : త‌గ్గుముఖం..

వివిధ ప్రాంతాల‌లో బంగారం, వెండి Silver ధ‌ర‌లు చూస్తే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,470గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.89,340లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ.1,10,900లుగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.97,470గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ. 89,340లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,10,900 లుగా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.97,620గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.89,490లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.99,900లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.97,470,22 క్యారెట్ల ధర రూ.89,340 గా ఉంది. వెండి ధర కిలో రూ.99,900లుగా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.97,470,22 క్యారెట్ల ధర రూ.89,340గా ఉంది. వెండి ధర కిలో రూ.1,10,900లుగా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.97,470, 22 క్యారెట్ల ధర రూ.89,340గా ఉంది. వెండి ధర కిలో రూ.99,900లుగా ఉంది. నిన్న‌టితో పోలిస్తే వెండిధ‌ర కూడా కాస్త త‌గ్గింది.