అక్షరటుడే, ఇందూరు : Matam Pavan Campaign | ప్రజల మనిషిగా మీ ముందుకు వస్తున్నానని 8వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి (BJP Corporator Candidate) మఠం పవన్ అన్నారు. ఈ మేరకు కాలనీల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు.
Matam Pavan Campaign | ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా..
ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని మఠం పవన్ తెలిపారు. డివిజన్‌కు సంబంధించిన ప్రతి సమస్యపై తనకు అవగాహన ఉందని వాటి పరిష్కారంలో ప్రజల సహకారంతో ముందుకు వెళ్తానని ఆయన చెప్పారు. ముఖ్యంగా డ్రెయినేజీ (Drainage), తాగునీటి సమస్యలు (Drinking Water Problems), శివారు కాలనీలో రోడ్ల సమస్య ఉందని ఈ సమస్యల పరిష్కారానికి ప్రణాళికతో ముందుకు వెళ్తానని పేర్కొన్నారు.
బీజేపీ నాయకుల సహకారంతో..
నిజామాబాద్ (Nizamabad) అర్బన్‌లో ఎంపీ అర్వింద్ (MP Arvind), ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారయణ గుప్తా (MLA Dhanpal) సహకారంతో డివిజన్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానన్నారు. ప్రజా పథకాల అమలులో నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
