అక్షరటుడే, వెబ్డెస్క్ : ASO Transfers | రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో 134 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లను (Assistant Section Officers) బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో (Dr. BR Ambedkar Secretariat) పలు విభాగాల్లో పని చేస్తున్న ఏఎస్వోలకు ప్రభుత్వం స్థానచలనం కలిగింది. సెక్రటేరియట్ పరిధిలోనే వారిని ట్రాన్స్ఫర్ చేసింది. మొత్తం 134 మంది ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు (transfers and postings) ఇస్తూ సీఎస్ ఆఫీస్ ఆర్డర్ జారీ చేశారు. వీరిలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారే అధికంగా ఉన్నారు. కాగా.. ఒకే శాఖలో ఏళ్లుగా పని చేస్తున్న ఓ ఏఎస్వోను సైతం ట్రాన్స్ఫర్ చేయడం గమనార్హం.
ప్రభుత్వం జనవరిలో సైతం ఒకేసారి 177 మంది సెక్షన్ ఆఫీసర్లను బదిలీ చేసింది. లీకులను అరికట్టేందుకే ఈ స్థాయిలో భారీగా బదిలీలు చేపట్టారని ఆ సమయంలో వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి భారీగా బదిలీలు చేపట్టడం గమనార్హం.
