అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Venezuela | వెనిజులా దేశంలో శనివారం తెల్లవారుజామున భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. రాజధాని నగరం కరాకస్‌లో దాదాపు 7 చోట్ల పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి.
రాజధాని నగరంలో పెద్ద ఎత్తున పేలుళ్లు చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. తక్కువ ఎత్తులో విమానాలు ఎగురుతున్నట్లు తెలిపింది. పేలుళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్నాయి. వెనిజులాపై అమెరికా వైమానిక దాడులు చేపట్టినట్లు పలువురు అనుమానిస్తున్నారు. ఇటీవల ట్రంప్ ఆ దేశాన్ని హెచ్చరించారు. ఈ క్రమంలో కారకాస్ పేలుళ్లు (Caracas Blasts) చోటు చేసుకోవడం గమనార్హం.
Venezuela | స్పందించని అమెరికా..
వెనిజులలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. డ్రగ్స్ వెనిజులా నుంచి అమెరికాలోకి వస్తున్నట్లు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు. దీనిని అరికట్టడానికి ఆ దేశ భూభాగంపై దాడులు చేపడతామని ఇటీవల హెచ్చరించారు. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగున్న నేపథ్యంలో పేలుళ్లు చోటు చేసుకోవడంతో అమెరికా పనేనని పలువురు అనుమానిస్తున్నారు. అయితే ఈ దాడులపై అమెరికా (America), వెనిజులా అధికారికంగా స్పందించలేదు. పేలుళల్లో ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు.
Venezuela | ప్రభుత్వాన్ని కూల్చేయత్నం
డ్రగ్స్ ముఠాలతో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ (Venezuelan President Nicolás) మదురోకు సంబంధాలున్నాయని ట్రంప్ ఆరోపించారు. ఆయనను పదవి నుంచి దింపడానికి అమెరికా యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కరేబియన్ సముద్రం, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న పడవలపై కూడా US సైన్యం అనేక ప్రాణాంతక దాడులు చేసింది. కఠినమైన ఆంక్షల ద్వారా మదురోను పదవి నుంచి దింపాలని ట్రంప్ యత్నిస్తున్నారు. దీనిపై మదురో స్పందిస్తూ.. వెనిజులా పెద్ద చమురు నిల్వలు, అరుదైన ఖనిజ వనరులను పొందేందుకు అమెరికా తనను అధికారం నుంచి తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.